Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఓట్లు వేయడానికి సొంత ఊర్లకు కదిలిన ఓటర్లు.

Share This Post 🔥

హైదరాబాద్ :    నగరంలోని ఆంధ్రా ఓటర్లు కదిలారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నారు.

సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచీగూడ రైల్వేస్టేషన్లు జనసంద్రంగా మారాయి.

ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు అమాంతం రేట్లు పెంచేసి.. నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చిన వారు దాదాపు 30 లక్షల పైనే ఉంటారని అంచనా. ఏటా పండగలు, ప్రత్యేక రోజుల్లో తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఆ సమయాల్లో వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి సమయంలో… ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులను నడిపి లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చింది. కానీ, ఓట్ల పండుగకు ప్రత్యేక బస్సులు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కొందరు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు ఏదోరకంగా చేరుకొని, అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంతూరు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పట్టు వదలని విక్రమార్కుల్లా ఎలాగైనా ఈసారి ఓటేసి రావాలని డిసైడయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!