ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

తమ పెళ్లికి రావాలంటూ అల్లు కుటుంబాన్ని ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

Share This Post 🔥

హైదరాబాద్‌ :  కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ ఇంట సందడి చేశారు. కాబోయే భర్త సచ్‌దేవ్‌తో కలిసి వెళ్లి, తమ పెళ్లికి రావాలంటూ అల్లు కుటుంబాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన పెళ్లి శుభలేఖను అందించారు. అనంతరం, అర్జున్‌, ఆయన తండ్రి అరవింద్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బన్నీతో కలిసి వరలక్ష్మి తీసుకున్న సెల్ఫీ క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌తో మీటింగ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వరలక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దానిపై అర్జున్‌ స్పందిస్తూ… తనకూ సంతోషంగా ఉందన్నారు.

తన వివాహ తేదీ వివరాలను వరలక్ష్మి ఇంకా అభిమానులతో పంచుకోలేదు. జులై మొదటి వారంలో వేడుక ఉండొచ్చని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు తమిళ నటులను ఆహ్వానించారు. ‘క్రాక్‌’, ‘వీరసింహారెడ్డి’, ‘హనుమాన్‌’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!