Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

భార్య అరాచకాలు తట్టుకోలేక ఇంట్లో సీక్రెట్‌గా సిసి కెమెరాలు పెట్టిన భర్త… బయటపడిన వివాహిత దారుణాలు…

Share This Post 🔥

భార్య అరాచకాలు తట్టుకోలేక ఓ భర్త తన ఇంట్లోనే సీక్రెట్‌గా సీసీటీవీ కెమెరాలో అమర్చాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆమె టార్చర్ నుంచి విముక్తి పొందాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భర్త మర్మాంగాలపై సిగరెట్‌ వెలిగించి వాతలు పెడుతున్న ఓ వివాహితను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త ఫిర్యాదు, అతడు ఇచ్చిన ఆధారాలతో ఆమెను మే 5న అరెస్టు చేశారు.

బాధితుడు మనన్ జైదీ తన భార్య తనను రోజూ టార్చర్ పెడుతోందని ఫిర్యాదు చేశాడు. మత్తు మందు ఇచ్చి మరీ చిత్ర హింసలకు గురి చేస్తోందని అన్నాడు. మత్తులో ఉన్న తన చేతులు, కాళ్లు కట్టేసి సిగరెట్ వెలిగించి మర్మాంగాలపై వాతలు పెడుతోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీ కూడా పోలీసులకు అందించాడు. భార్య టార్చర్ పెట్టినట్టు తాను గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్టు అతడు చెప్పుకొచ్చాడు.

కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్య మెహెర్ జహాన్‌పై హత్యాయత్నం, దాడికి పాల్పడటం,. చిత్రహింసలకు గురిచేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ”బాధితుడి ఫిర్యాదు మేరకు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటున్నాం” అని ఎస్పీ ధరమ్‌పాల్ సింగ్ మీడియాకు తెలిపారు. అయితే, భార్యాభార్తల మధ్య గొడవకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!