Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

నిజమే… ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాం : చైనా

Share This Post 🔥

  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా  కొంతకాలంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇదే విషయాన్ని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (CPC) అంగీకరించింది. డిమాండ్‌ క్షీణించడం, అనిశ్చిత బాహ్య కారణాలే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యల కోసం జులైలో జరిగే సీపీసీ సెంట్రల్‌ కమిటీ సమావేశం ‘ప్లీనం’లో చర్చించాలని నిర్ణయించింది.

కొవిడ్‌-19 మహమ్మారి, తీవ్రమవుతోన్న ప్రాపర్టీ మార్కెట్‌ సంక్షోభాలతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన 24 మందితో కూడిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో అంగీకరించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. స్థానికంగా, విదేశాల్లో చైనా సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావించారని తెలిసింది. డిమాండ్‌ తగ్గిపోవడం, సంస్థలు ఎదుర్కొంటున్న నిర్వహణ భారం, అనిశ్చితంగా ఉండే బాహ్య వాతావరణం వంటి సవాళ్ల గురించి హెచ్చరించినట్లు చైనా అధికార వార్తా సంస్థ వెల్లడించింది.

ఎన్నో వ్యాపార సంస్థలు నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు విదేశాలకు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడు చెప్పినట్లు సమాచారం. దేశీయ, సామాజిక, ఆర్థిక విధానాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తాజా సమావేశంలో పిలుపు నిచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!