Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

తిరుపతిలో పరిస్థితి అదుపులోనే ఉంది.  నిందితులను అరెస్టు చేస్తాం : ఎస్ పి.

Share This Post 🔥

చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ రంగంలోకి దిగారు. పద్మావతి మహిళా వర్సిటీకి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడిలో గాయపడిన పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, సేఫ్‌గానే ఉన్నట్టు తెలిపారు. యూనివర్సిటీ వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉందని చెప్పారు. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగివస్తుండగా.. నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలవగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 150 మందికిపైగా వైకాపా కార్యకర్తలు రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. నడవలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే దాడులకు దిగారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైకాపా మూకలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!