Uncategorizedఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయం

కడుపు కోతలో తల్లిదండ్రులు… చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది.

Share This Post 🔥

ఇస్లామాబాద్‌:    అప్పటికే కుమారుడి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు.. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనతో నిర్ఘాంతపోయారు. అంత్యక్రియల కోసం తరలిస్తోన్న బాలుడి మృతదేహం…

తమవెంట విమానంలో రాకపోవడంతో వారు అవాక్కయ్యారు. పాకిస్థాన్‌(Pakistan)లో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని ఖర్మాంగ్ జిల్లాకు చెందిన ఆరేళ్ల ముజ్తాబా.. కణితి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో బాలుడిని రావల్పిండిలోని బెనజీర్‌ భుట్టో ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం మృతి చెందాడు. ఆ వార్త బాలుడి తల్లిదండ్రుల్ని ఎంతో కుంగదీసింది. గుండె దిటవు చేసుకొని అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతూరు తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ రోడ్డు మార్గంలో వెళితే ఆలస్యమవుతుందని భావించి.. విమానంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే వారి ఆలోచనంతా తలకిందులైంది.

వారు గిల్గిత్‌లోని స్కర్దు విమానాశ్రయానికి వచ్చాక అసలు విషయం తెలిసింది. వారి కుమారుడి మృతదేహాన్ని సిబ్బంది విమానంలోకి ఎక్కించలేదన్న విషయం తెలిసి వారు కంగుతిన్నారు. దాంతో వారి రోదనలతో ఆ ప్రాంతం మారుమోగింది. సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది.. తమ తప్పును సరిదిద్దుకుంటామని హమీ ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!