ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

కల్కి చిత్రానికి ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడానికి అసలు సూత్రం…

Share This Post 🔥

కల్కి చిత్రానికి మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ వస్తోందంటే.. కల్కి స్టామినా వందలు-వేల కోట్లకు చేరబోతోందంటే.. ఆరువేల సంవత్సరాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి కూడా మన దర్శకుడు ఆబాల గోపాలాన్ని కంటెంట్‌కు కనెక్ట్ చేయించాడంటే…

ఇది కాదా సక్సెస్ మంత్ర.. ఇది కాదా క్కావల్సిన అసలైన కమర్షియల్ మార్గం.. ఇది కాదా దర్శక ప్రతిభకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్.. ఇండియన్ కు మైథాలజీ ఎంత గొప్ప ఎడ్వాంటేజ్ అనేది రుజువు చేసి చూపించారు నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్‌అశ్విన్. ఆవిధంగా నవయువ నిర్మాణానికి, మోడ్రన్ మేకింగ్ వ్యాల్యూస్‌కి ఆదర్శప్రాయుడయ్యాడు. పాత పురాణాల్ని కొత్త జెనరేషన్‌కి అర్థమయ్యేలా చెప్పడం.. అనే సబ్జెక్ట్‌లో కల్కి ను లేటెస్ట్ కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు.

మహానటి తర్వాత నాగీ ప్రయోగశాల నుంచి బైటికొచ్చిన మరో అద్భుతం కల్కి. మహాభారతంలోని పరశురాముడి కథకు కొనసాగింపుగా నేపథ్యాన్ని రాసుకుని, దాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడంటూ ప్రశంసలొస్తున్నాయి. విజువల్ బ్రిలియన్స్ అని, అరుదైన దృశ్యకావ్యం అని కాంప్లిమెంట్ల వరద పారుతోంది. భూత-వర్తమాన-భవిష్యత్ కాలాలకు సంబంధించి సిట్యువేషన్లు, క్యారెక్టర్లు క్రియేట్ చేసి.. వాటిని మూడు తరాలకూ కనెక్ట్ చేసి.. ఆడియన్స్‌ని తనతో పాటు నడిపించి.. భళా అనిపించాడు దర్శకుడు. ఇటువంటి కథల్ని ఊహించడమే తప్ప.. తెరపై చూపించడం చాలా కష్టం.

కల్కి కు మూలం అశ్వద్ధామ అమరత్వం. మహాభారత మూలాల ఆధారంగా అశ్వథ్థామ చిరంజీవి.. చావులేని వాడు కనుక అతడి పాత్రను ఆధునికయుగంలో కూడా ప్రవేశపెట్టి.. దాని చుట్టూ కథ అల్లుకున్నాడు నాగ్ అశ్విన్. అశ్వర్థామతోనే ఆగిపోలేదు నాగీ. కల్కి కంటెంట్‌లో మహాభారతం రిఫరెన్సులు చాలానే చూపించాడు. ఎనిమిది అడుగుల ఎత్తున్న అశ్వత్థామగా బిగ్‌బీని ప్రెజంట్ చేసి.. అదే పొట్రెయిట్‌తో ఫైటింగ్ సీన్లు క్రియేట్ చేసి వావ్ అనిపించారు. పూర్తి నిడివి గల అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్‌, కాసేపు కనిపించే అర్జునుడిగా విజయ్ దేవరకొండ అప్పియరెన్స్‌ని లో బాగా బ్యాలెన్స్‌ చేశాడు. పౌరాణిక పాత్రలతో కురుక్షేత్ర యుద్ధాన్ని చూపించి.. అదే చేత్తో అదే లో 6 వేల ఏళ్ల తర్వాత మోడ్రన్ యుగంలో ఫైట్ సీక్వెన్స్‌ని చూపించి.. హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు. VFXవాడకంలో కూడా సెభాష్ అనిపించుకుంది కల్కి టీమ్.

కల్కిని జస్ట్ ఒక లా తీసి సోసోగా వదిలేలా లేడు నాగ్‌ అశ్విన్. కల్కి ఫ్రాంచైజీ పేరుతో టోటల్ టిక్ యూనివర్స్‌నే ఆడియన్స్‌కి చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అశ్వర్థామ చుట్టూ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు.. తర్వాతి భాగాల్లో కూడా మహాభారతంలోని ఏదో ఒక క్యారెక్టర్‌తో లింక్ ఉండేలా ఫ్యూచర్ కల్కి కంటెంట్‌ని డిజైన్ చేసుకుంటున్నాడు. 33 ఏళ్ల కిందట ఆదిత్య-369 పేరుతో వర్తమాన-భవిష్యత్తుల్ని కలిపి తెరపై ఆవిష్కరించారు సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు కల్కి ప్రాజెక్టుకు సింగీతాన్నే మెంటర్‌గా పెట్టుకుని, అద్భుతాలు కమింగ్‌సూన్‌ అని హింట్ ఇచ్చారు డైరెక్టర్ నాగ్‌అశ్విన్.

హాలీవుడ్ సూపర్‌హీరో ఫిలిమ్ జానర్‌ని ఇండియన్ మైథాలజీతో అనుసంధానిస్తూ నాగీ చేసిన ప్రయత్నం సక్సెస్ ఐనట్టే లెక్క. మహాభారతంలో క్యారెక్టర్లను మోడ్రన్ ఏజ్‌కి పరిచయం చేస్తూ.. దాన్ని సైంటిఫిక్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా మలచడం ఒక సాహసం. సాహసం చేస్తే పోయేదేమీ లేదు.. అని ధైర్యంగా ముందుకెళ్లి ఫ్యూచర్ ను కళ్లముందు నిలబెట్టాడు నాగీ. మన దేవతామూర్తుల్ని ఫిజికల్ ఫామ్‌లోకి తీసుకొచ్చి.. జేమ్స్‌ కామెరూన్ చేసిన అవతార్‌ ను చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది. మన పురాణాలు హాలీవుడ్‌ వాళ్లు ఎడాప్ట్ చేసుకుని బ్లాక్‌బస్టర్లు కొడుతుంటే.. మనం మాత్రం వెనకెనకే ఎందుకుండాలి.. అనేది కల్కి దర్శకుడి లాజిక్.

సో.. హాలీవుడ్‌ వాళ్లే నెత్తినపెట్టుకుని కలెక్షన్లు దండుకుంటున్న ఇండియన్ మైధాలజీ.. ఇండియన్ కు మాత్రం సక్సెస్ మంత్ర కాకుండా ఎందుకుంటుంది..? మైథలాజికల్ క్యారెక్టర్లను ఉన్నదున్నట్టు వాడ్డం కాదు.. వాటికి మోడ్రన్ టచ్ ఇచ్చి.. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే.. ఆడియన్స్‌ ఈజీగా కనెక్ట్ అవుతారు. దానికి నిదర్శనమే ఇప్పుడు కల్కి కు వస్తున్న సూపర్‌ పాజిటివ్ రెస్పాన్స్‌. పురాణాలకు అప్‌డేషన్ ఇస్తూ.. పాత కథల్నే కొత్తగా వండితే.. వాటిని చూడదగ్గగా తీస్తే.. టిక్కెట్లు కొనుక్కుని చూడ్డానికి మేం ఎప్పుడూ సిద్ధం.. అని సిగ్నల్ ఇచ్చేశాడు సగటు ప్రేక్షకుడు. సో… నాగీని స్పూర్తిగా తీసుకుని కల్కి లాంటి సూపర్‌ న్యాచురల్ స్టోరీల్ని.. ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!