ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతెలంగాణమహిళరాజకీయం

మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ : మంత్రి దామోదర్ రాజ నరసింహ.

Share This Post 🔥

క్వాలిటీ డాక్టర్లను తయారు చేసేలా మెరుగైన విద్య


హైదరాబాద్. :: మెడికల్ఎడ్యుకేషన్కు అత్యున్నత గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

క్వాలిటీ డాక్టర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కాలేజీలతోపాటు డెంటల్ కాలేజీల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని, మెడికల్ ఎడ్యుకేషన్కు పూర్వవైభవం తెస్తామని చెప్పారు.

బుధవారం ఆయన సెక్రటేరియెట్లోని తన చాంబర్లో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, డీన్లతో సమావేశమయ్యారు. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయొద్దని ఆయా విద్యా సంస్థలను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల నుంచి మెడిసిన్ చదివిన డాక్టర్లకు ఎంతో గౌరవం ఉండేదని గుర్తు చేశారు.

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా మెడిసిన్ చదువును మెరుగుపరుస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలో 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా.. 28 ప్రైవేటు కాలేజీల్లో 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,320 పీజీ సీట్లు, స్పెషాలిటీ పీజీ సీట్లు 179, ప్రైవేటు కాలేజీల్లో 1,566 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపారు.

కాగా, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా కాలేజీల యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రాజనర్సింహ వారికి హామీ ఇచ్చారు. కొన్ని కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో మెడికల్ఎడ్యుకేషన్ డైరెక్టర్వాణి, స్పెషల్ ఆఫీసర్ మెడికల్ ఎడ్యుకేషన్ విమలా థామస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!