Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

CM రేవంత్ రెడ్డికి సమన్లు… మంత్రి ఉత్తమ్ కుమార్ ఘాటు రియాక్షన్ ..!

Share This Post 🔥

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక, తాజాగా ఈ నోటీసులపై రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారన్నారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!