Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతుంది ::  కేసీఆర్

Share This Post 🔥

జగిత్యాల: పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్న కెసిఆర్ … కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ భారాస అభ్యర్థులు వినోద్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ను పరిచయం చేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి కరవు పరిస్థితులను చూసి వరద కాలువ  పునరుజ్జీవ పథకంతో నీళ్లతో నింపితే.. ఇప్పుడు ఆ కాల్వను ఎందుకు ఎండబెడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.

జగిత్యాల జిల్లా చేసుకుంటే.. రేవంత్‌రెడ్డి తీసేస్తా అంటున్నాడు. జిల్లా కావాలా..? వద్దా..? రైతు బంధు వచ్చిందా.. డబ్బులు ఖాతాల్లో పడ్డాయా..? కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసం. మభ్యపెట్టి మోసాలతో ఓట్లు దండుకున్నారు. రైతు బంధుకు 5 ఎకరాలకు సీలింగ్‌ పెడతారట..25 ఎకరాలకు పెట్టాలి. భారాస ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదు అంటున్నారు. నలుగురు భాజపా ఎంపీలు గెలిచారు.. ఒక్క పైసా అయినా తెచ్చారా..? ఇక్కడ గెలిచిన అర్వింద్‌ పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదు. మోదీ.. గోదావరి జలాలు తీసుకుపోతా అంటున్నారు.. మన జలాల గురించి భాజపా వాళ్లు కొట్లాడుతారా…? దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో యువత ఆలోచించి ఓటు వేయాలి” అని కేసీఆర్‌ కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!