Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే : చంద్రబాబు

Share This Post 🔥

  ధర్మవరం: ‘దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే’ అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన పాల్గొన్నారు.

” ప్రజలు గెలవాలి.. దుర్మార్గుడిని ఇంటికి పంపాలని అమిత్‌షా చెప్పారు. జగన్‌ మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు. అమరావతిని నాశనం చేసిన ఆయన ను ఇంటికి పంపాల్సిందే. అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నంబర్‌ వన్‌ రాజధానిగా తీర్చిదిద్ది ప్రపంచపటంలో పెట్టే బాధ్యత ఎన్డీయేది. కేంద్రం, రాష్ట్రం కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని,. అమరావతికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టంగా చెప్పారు. పోలవరంపై నిర్దిష్ట హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన ఆశలను సైకో జగన్‌ సర్వనాశనం చేశారన్నారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించారు. పోలవరం పూర్తిచేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని,. రాయలసీమ ద్రోహి జగన్‌ అన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదని, ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి జగన్‌ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఏటా 4లక్షలు చొప్పున 20లక్షల ఉద్యోగాలిస్తామని,. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సమర్థ నాయకత్వం ఉండి కేంద్ర సహకారం తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది”అని చంద్రబాబు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!