జాతీయంతెలంగాణమహిళరాజకీయం

టీఎస్ఆర్టీసీ పేరు మార్పు, ఇకపై టీజీఎస్ఆర్టీసీ.

Share This Post 🔥

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీఎస్ ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇకపై టీఎస్ కు బదులు టీజీ కనిపించనుంది.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, వాహనాల రిజస్ట్రేషన్లు అన్నీ టీజీ తో ఉండనున్నాయి.

ఇటీవలే లోగోను మారుస్తున్నట్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ అధికారులు.. ఇవాళ టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. అధికారిక ట్విట్లర్ అకౌంట్లు కూడా tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది.

ఇకపై ఎవరైనా సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సజ్జనార్ కోరారు. TGSRTC అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice , @tgsrtchq అకౌంట్లను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో బస్సులు కూడా టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్ కానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!