Uncategorizedఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళ

మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు..

Share This Post 🔥

మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది.
పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక మాధ్యమిక విద్య (పీయూసీ- ఇంటర్మీడియట్‌ సమాన) పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. బెంగళూరులోని బనశంకరి పోలీసు ఠాణా పరిధిలో నివాసముండే పద్మజ (40) మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని సోమవారం తన కుమార్తె (17)ను ప్రశ్నించింది. ఆమె కోపంతో కత్తి తెచ్చి తల్లిని నాలుగు సార్లు పొడిచింది.

తల్లి కూడా కత్తి అందుకుని కుమార్తెపై ఎదురుదాడి చేసింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన పద్మజను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!