జాతీయంతెలంగాణరాజకీయం

మంత్రి ఉత్త‌మ కుమార్ రెడ్డి అవినీతి పై కేంద్రానికి లేఖ రాస్తా :: ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి.

Share This Post 🔥

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్త‌మ కుమార్ రెడ్డి అవినీతి పై కేంద్రానికి లేఖ రాస్తాన‌ని రాష్ఠ్ర బీజేఎల్పీ నాయకులు ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ నాంప‌ల్లి బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. నేను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలు అని అన్నారు.

నేను 19 ప్రశ్నలతో సీఎం కు లేఖ రాశానని… ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం సంతోషం అని అన్నారు.అయితే తాను మాట్లాడిన మాటలకు మంత్రి నాపై పర్సనల్ ఎటాక్ చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారని… దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని మ‌హేశ్వ‌ర‌రెడ్డి అన్నారు. నేను పైరవీ చేసి బీజేఎల్పీ పోస్ట్ తెచ్చుకున్నానని చేసిన కామెంట్ సరికాదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని….బీజేపీ లో అందరి సమన్వయంతో నన్ను బీజేఎల్పీ గా నాకు అవకాశం కల్పించార‌ని స్ప‌ష్టం చేసారు.

ఇక “నేను మీతో కలిసి పదేళ్లు పని చేశాను ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా ?” అని ఎద‌రు ప్ర‌శ్న వేశారు…బీజేఎల్పీ నేత‌. మీలా దిగజారి ఆరోపణలు చేయలేనని..మా అధ్యక్షుడు అనుమతితో నే నేను సీఎం ను కలవడానికి వెళ్ళానని నీవు దాన్ని కూడా అనుమాన పడేలా మాట్లాడితే అది మీ సీఎం ను అవమానించడమేన‌ని అన్నారు.

ఇక ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించలేదు…అలాగే యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతుందని అన్నారు. డి – ఫాల్టర్ల పేర్లను బయట పెడతారా ?తరుగు పై మంత్రి ఏనాడైనా క్షేత్ర స్థాయిలో ఎపుడైనా పరిశీలించారాకుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు…ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్ల తో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 4 కంపెనీలకు అప్పజెప్పారు మీకు ఎఫ్.సీ.ఐ ఇచ్చిన గడువు మే 15 న ముగిసింది.

అలాగే ఎఫ్.సీ.ఐ ఇచ్చిన గడువు కంటే కాంట్రాక్టర్ల కు మరో నాలుగు నెలలు అదనపు సమయం ఇవ్వడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. నేను రాజకీయంగా మాట్లాడితే .. మీరు పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు

నేను పర్సనల్ గా తీసుకుంటే మీరు చాలా నష్టపోక తప్పదు ఇది బాగోదు జాగ్రత్త వేలెత్తి చూపిస్తే … మీ కుందేళ్ళ సప్పుడుకి ఇక్కడ ఎవరు భయపడరు అని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో జరిగిన అవినీతి పై సిట్టింగ్ జడ్జితో తో విచారణ లేదా సీబీఐ కి అప్పజెప్పాలి అని టీబీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!