Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి వద్దకు మల్లారెడ్డి భూ పంచాయితీ..! సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.

Share This Post 🔥

మాజీమంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూవివాదం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో తమ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపణల క్రమంలో వారిపై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. దీంతో తన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, సరైనవే అయితే అడ్లూరి రిజైన్ చేస్తారా? అని మల్లారెడ్డి సవాల్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వద్దే తేల్చుకునేందుకు మల్లారెడ్డి సిద్ధం అవుతుండగా ఇదే ఇష్యూలో తనపై మల్లారెడ్డి లేనిపోని అభాండాలు వేస్తున్నాడని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తాను కూడా సీఎంను కలిసి మల్లారెడ్డి బండారం అంతా బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మల్లారెడ్డి భూ పంచాయితీ కాస్త పొలిటికల్ పంచాయితీగా మారనుందా? అన్న ఉత్కంఠ నెలకొన్నది.

సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్..

కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం సర్వేనెంబర్ 82/1/EE లో నెలకొన్న వివాదంపై మల్లారెడ్డి  తనపై అభాండాలు వేస్తున్నాడని అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ ఆయ్యారు. తనకు 2,000 ఎకరాల భూమి ఉన్నదని చెబుతున్న మల్లారెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కొంపల్లిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. సదరు భూమిని కె.సుధామ నుంచి 2015లో తనతో పాటు మరో 8 మంది 3,393 గజాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసినవారిలో అప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారని చెప్పారు. పహాణి ప్రకారమే రిజిస్టర్ చేసుకున్నామన్నామని, ఆ భూమిని 2021లో సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అందరం కలిసి అమ్మేశామన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం యజమాని పొజిషన్‌లోకి వెళ్తే దౌర్జన్యం చేయడం దారుణమని మండిపడ్డారు.

కేటీఆర్ నాకేమైనా ఫ్రీగా చేశాడా..?

పదేళ్లు అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి తన భూమిగా చెప్తున్న స్థలంలో ఎందుకు నిర్మాణ పనులు చేపట్టలేదని అడ్లూరి ప్రశ్నించారు. 2016లో తమకి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఖాళీ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అన్నారు. ఆయన దగ్గర సరైన డాక్యుమెంట్లు ఉంటే.. సర్వే ఎందుకు అవసరం లేదని అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ భూ వివాదాన్ని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని ఆ సమయంలో ఈ ఇష్యూని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిందిగా మల్లారెడ్డికి కేటీఆర్ సూచించారని తెలిపారు. అయితే కేటీఆర్ ముందు సరేనన్న మల్లారెడ్డి ఆ తర్వాత ‘కేటీఆర్ నాకేమైనా ఫ్రీగా చేశాడా? నేను మీకు ఏ విధంగా చేస్తాను’ అంటూ రివర్స్ మాట్లాడారని అడ్లూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మల్లన్న దారెటు..?

ఇటీవల కాలంలో మల్లారెడ్డికి ఏదీ కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల అక్రమ నిర్మాణాలంటూ పలుచోట్ల మర్రి రాజశేఖర్‌రెడ్డి నిర్వహిస్తున్న కాలేజీల భవనాలను అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఆ తర్వాత మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థులను డిటెయిన్ చేసిన వ్యవహారం దుమారంగా మారింది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరుతారని ఈ మేరకు డీకే శివకుమార్‌తోనూ భేటీ అయి వచ్చారనే చర్చ జోరుగా వినిపించింది. ఆ తర్వాత మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డిని పొలిటికల్‌గా లాంచ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పటికీ ఏం జరిగిందో ఏమో కానీ చివరి నిమిషంలో పోటీ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇలా వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న మల్లారెడ్డి పొలిటికిల్ దారి ఎటు? అన్న చర్చ నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!