ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

మల్కాజిగిరి ఓటర్ల విలక్షణ తీర్పు… !

Share This Post 🔥

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హవా

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం.

మేడ్చల్‌ :   దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం, మినీ ఇండియాగా పిలువబడే మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు.

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. ఏడింటికి ఏడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు గెలుపొందారు. కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించింది. ప్రస్తుతం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. ఈటల రాజేందర్‌కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి రాలేదు. బీఆర్‌ఎస్‌ ఓట్లన్నీ కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగి బీజేిపీకి పోలైనట్లు ఆపార్టీ శ్రేణులు చర్చించుకోవడం గమనార్హం.

అసెంబ్లీలో ఓడి.. పార్లమెంటులో గెలిచి..

మల్కాజిగిరి పార్లమెంటు నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. హుజూరాబాద్‌, గజ్వేల్‌ స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటమి చెంది మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈటల రాజేందర్‌ కూడా అదే తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గతంలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈటల రాజేందర్‌ కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని, మల్కాజిగిరి పార్లమెంటు నుంచి గెలుపొందిన వారు ఉన్నత పదువులు పొందే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!