చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

కల్కి చిత్రం రివ్యూ…మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో కల్కి…

Share This Post 🔥

మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ కీ రోల్స్ లో నటించిన కల్కి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టాప్ యాక్టర్స్, టెక్నీషియన్స్ నాలుగేళ్ల పాటు వర్క్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.ముందుగా చెప్పినట్టు మరో లెవిల్లో ఉందా తెలుసుకుందాం..

కురుక్షత్ర యుద్దంలో తన వారందరినీ అంతం చేసిన పాండవుల మీద కోపంతో రగిలిపోతుంటాడు అశ్వత్థామ. పాండవులకు వారసుడే ఉండవద్దని అభిమన్యుని భార్య ఉత్తర గర్భం మీద బ్రహ్మస్త్రాన్ని సంధిస్తాడు. ఆ శిశువు గర్భంలోనే మరణిస్తుంది. దీంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు.అయితే క్షమించమని ప్రాయశ్చిత్తపడిన అశ్వత్థామకు 6 వేల యేళ్ల తర్వాత కలియుగాంతంలో తల్లి గర్బంలో ఉన్న నన్ను నువ్వే కాపాడాలని కృష్ణుడు చెప్పుతాడు.

కట్ చేస్తే ప్రపంచమంతా కరువు కాటకాలతో నశించిపోగా కాశీ నగరం మాత్రమే మిగిలి వుంటుంది.ఇక్కడ సుప్రీం యాస్కీన్ కాంప్లెక్స్ అనే వండర్ ఫుల్ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రాజెక్ట్ కె పేరుతో 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సిరమ్ కలెక్ట్ చేయాలని ప్రయోగాలు చేస్తుంటారు.100 రోజులకు మించి ఏ అమ్మాయి గర్భాన్ని మోయలేకపోతుంది.

కాంప్లెక్స్ కింద ప్రజలు సరైన గాలి,నీరు,తిండీ తిప్పలు దొరక్క కష్టాలు పడుతుంటారు.వీళ్లతో రకరకాల పనులు చేయించుకుంటూ నరకం చూపిస్తూ వుంటుంది సుప్రీం ఆర్మీ. ఆ ఆర్మీ చెప్పిన బౌంటీలు చేస్తే యూనిట్లు ఇస్తుంటారు.అలా వాళ్లు చెప్పిన పనులు చేసి యూనిట్లు సంపాదించి కాంప్లెక్స్ లో హాయిగా బతుకాలని కలలు కంటూ వుంటాడు భైరవ.

మరో వైపు మంచి కోసం శంభల ప్రజలు రహస్యంగా కాంప్లెక్స్ మీద పోరాటం చేస్తూ వుంటారు.భగవంతుడిని కనే తల్లి ఎప్పటికైనా తమ దగ్గరికి వస్తుందని నమ్ముతూ ఉంటారు.కాంప్లెక్స్ నుంచి 150 రోజుల గర్భంతో వున్న సుమతి తప్పించుకుని పోతుంది.ఆమెను పట్టుకోవడానికి కాంప్లెక్స్ ఆర్మి రంగంలోకి దిగుతుంది.ఆమెను రక్షించుకోవడానికి శంభల ప్రజలు ఒకవైపు, అశ్వత్థామ మరోవైపు పోరాడుతూ ఉంటారు.

అయితే సుమతిని పట్టుకొస్తే కాంప్లెక్స్ లోకి ఎంట్రీ ఇస్తామని ఆశ చూపడంతో భైరవ కూడా రంగంలోకి దిగుతాడు.చివరకు ఏం జరుగుతుంది.కాంప్లెక్స్ ఆర్మి గెలిచి సుమతిని తీసుకెళ్తారా…లేక బైరవ ఆమెను బంధించి కాంప్లెక్స్ చేరుకుంటాడా.. శంభల ప్రజలు ఆమెను కాపాడతారా… అశ్వత్థామ రక్షించి పాప విముక్తుడు అవుతాడా అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

6 వేల యేళ్ల తర్వత భవిష్యత్తు ఎలా వుండబోతోందనే ఊహను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం సూపర్. కాంప్లెక్స్, శంభల, కాశీ …ఇలా మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ రకరకాల క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్టాఫ్ నడిపించాడు.భైరవ, అశ్వత్థామ లతో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది.
ఇంటర్వెల్ తర్వాత మూవీ రన్ అయిన విధానం మరో లెవిల్ లో వుంటుంది.లాస్ట్ 15 నిమిషాల క్లైమాక్స్ హాలీవుడ్ రేంజ్ దాటి ఉంటుంది.

ఇక క్యారెక్టర్ల విషయానికి వస్తే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ తనదైన యాక్టింగ్ తో అదరగొట్టాడు.ఫస్టాఫ్ లో లైట్ కామెడీతో జులాయిగా భైరవ పోర్షన్ లో కనిపించే ప్రభాస్ చివర్లో తన హీరోయిక్ యాక్షన్ తో మరోసారి రెబల్ స్టార్ అంటే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. మూవీ అంతా గర్భంతో సుమతి గా చాల నీట్ గా యాక్ట్ చేసింది దీపికా పదుకొణె. ఇక కొద్ది సేపే కనిపించిన సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

రాజేంద్రప్రసాద్,దిశా పటానీ, శోభన, పశుపతి, స్వాస్థ చటర్జీ లు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇక మూవీలో బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్,ఫరియా , అనుదీప్ తళుక్కున మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు.బుజ్జికి కీర్తి సురేశ్ వాయిస్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

సంతోష నారాయణన్ మ్యూజిక్, జోర్డే స్టోవిల్కోవిచ్ సినిమాటోగ్రఫి మూవీకి ప్లస్ పాయింట్స్. చివర్లో నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కల్కి నుంచి మోర్ అండ్ మోర్ ఎక్స్ పెక్ట్ చేసేలా ఎండ్ బ్యాగ్ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!