ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుచిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తున్న ” కల్కి”  వసూళ్ల సునామి…

Share This Post 🔥

వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమా అంటే ప్రస్తుతం వినిపిస్తోన్న పేరు కల్కి 2898ఏడీ. ఈ సినిమాపై హాలీవుడ్ క్రిటిక్స్ కూడా రివ్యూలు రాస్తున్నారు. అలాగే సినిమాలపై కంటెంట్ క్రియేట్ చేసే విదేశీ యుట్యూబ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ కల్కి 2898ఏడీ మూవీ అద్భుతంగా ఉందని చెబుతూ వీడియోలు చేస్తున్నారు.

దీంతో దేశంలోనే కాకుండా యూఎస్ లో కూడా ఇప్పుడు కల్కి మూవీ హాట్ టాపిక్ గా మారింది.

నార్త్ అమెరికాలో కల్కి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంతలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని ఐదు రోజుల్లోనే 11 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయి కలెక్షన్స్ అంటే రికార్డ్ అని చెప్పాలి. రాజమౌళి బాహుబలి మూవీ లాంగ్ రన్ కలెక్షన్స్ ని కల్కి మూవీ ఐదు రోజుల్లోనే నార్త్ అమెరికాలో బ్రేక్ చేసింది.

ఆ విషయంలో కల్కి కి తగ్గకుండా ‘పుష్ప 2’..! ప్రభాస్ సలార్ మూవీ ఓవర్సీస్ లో 15.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. ఆ నెంబర్ ని కూడా కల్కి 2898ఏడీ బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాగా బాహుబలి 2 ఉంది.

ఈ మూవీ 20.77 మిలియన్ డాలర్స్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. అయితే ఈ రికార్డ్ ని కల్కి బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. మరో వైపు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 500+ కలెక్షన్స్ ని కల్కి మూవీ వసూళ్లు చేసిందని వైజయంతీ మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. కేవలం నాలుగు రోజుల్లోనే 500+ కోట్లు కలెక్షన్స్ అందుకోవడం రేర్ ఫీట్ అని చెప్పొచ్చు.

కలెక్షన్స్ పరంగా ఇదే జోరు కొనసాగితే 10 రోజుల్లో 1000+ కోట్లు కలెక్షన్స్ ని కల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడు గంటలు నిడివి ఉన్న కూడా ప్రేక్షకులని కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్, బలమైన స్టోరీ నెరేషన్ కల్కి చిత్రంలో ఉంది. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్న కూడా ప్రేక్షకులను వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.

కేవలం సినిమాని, నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఫ్యూచర్ వరల్డ్ ని తెరపై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కల్కి 2898ఏడీతో ప్రభాస్ కి వచ్చినట్లే అని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఈ మూవీ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!