ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయం

లేటు ఫీజులకు వడ్డీలా…? వడ్డీ వ్యాపారులా… లేక స్కూలు యాజమాన్యాలా..? శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం.

Share This Post 🔥

కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజుల బాదుడు.. దోపిడీలపై ఇప్పటికే తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి.. ప్రతిఏటా అడ్డగోలుగా పెంచుతున్న స్కూల్స్ ఫీజులపై ప్రభుత్వం విద్యాశాఖ నియంత్రణ లేకపోగా…

ఇప్పుడు ఏకంగా లేట్ ఫీజుల చెల్లింపులపై స్కూల్ యాజమాన్యాలు వడ్డీలు కట్టించుకుంటున్నాయి. ఇదేదో తల్లిదండ్రులను పిలిచి చెబుతున్న మాట కాదు.. ఇళ్లకు పంపుతున్న సర్క్యులర్స్.. ఏ నెలలో ఎంత ఫీజు కట్టాలి.. ఎంత వడ్డీ వేస్తున్నది స్పష్టంగా చెబుతూ.. స్కూల్ లెటర్ హెడ్ పై రాసి మరీ స్కూల్ యాజమాన్యాలు ఇళ్లకు పంపిస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాల ఫీజులపై వడ్డీ బాదుడు ఏ విధంగా ఉంటుందో వివరంగా చూద్దాం.

హైదరాబాద్ లోని మీర్ పేట్ లోని శ్రీ చైతన్య స్కూల్ ఆగడాలు బయటకు వచ్చాయి. జూన్ లో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి స్కూల్ యాజమాన్యం ఫీజుల కండిషన్స్ పై సర్క్యులర్స్ జారీ చేశాయి. టైమ్ కు ఫీజుల కట్టకుంటే 2% నుంచి 3% ఇంట్రెస్ట్ వసూల్ చేస్తామంటూ సర్క్యులర్స్ లో క్లయిర్ గా మెన్షన్ చేశారు. మొదటి 6 నెల్లలో ఫీజు మొత్తం కడితే నో ఇంట్రెస్ట్ .. అలా కాకుండా 7 నెలలకు కడితే 2% , ఇక11 నెలలకు కడితే 3% ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుందంటూ సర్క్యులర్స్ లో మెన్షన్ చేసింది. దీంతో స్కూల్ తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చదువు చెప్పుతున్నారా లేకా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్కూల్ ఫీజులను కంట్రోల్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!