Uncategorizedఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంతెలంగాణమహిళరాజకీయం

భర్తను కొట్టారని భార్య ఆగ్రహం… నేరుగా వైన్ షాప్ కు వెళ్లి బీభత్సం.

Share This Post 🔥

మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు  సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య  ఆగ్రహంతో రెచ్చిపోయింది.

వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్‌కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది. దీంతో వైన్ షాపు సిబ్బందితో పాటు మహిళ మీద పోలీసులు వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ప్రకారం…

మద్యం షాపులో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన మధురానగర్‌ పోలీష్‌స్టేషన్‌ పరిధిలోచోటు చేసుకుంది. ఎస్ఐ సాయినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ యువతి మరికొందరితో కలిసి మధురానగర్‌లోని వైన్స్‌ షాపునకు వచ్చింది. అక్కడ సిబ్బందితో గొడవపడి షాపులోకి చొరబడి మద్యం బాటిల్స్‌ పగుల కొట్టింది. క్యాష్‌ కౌంటర్‌ వద్ద నానా రభస చేసింది. నిర్వాహకులు 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్‌లు డీఎం బాషా, నాగరాజు వైన్‌షాపు వద్దకు చేరుకున్నారు. గట్టిగా కేకలు వేస్తూ హల్‌చల్‌ చేస్తున్న యువతిని పోలీసులు వీడియో తీసేందుకు యత్నించారు. అది చూసిన యువతి పోలీసులపైకి దూసుకెళ్లి సెల్‌పోన్‌, ట్యాబ్‌లను లాక్కుని పగులకొట్టే యత్నం చేసింది. పోలీసులపై గోళ్లతో గీకుతూ నానా రభస చేసింది. ఎట్టకేలకు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!