ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా…!

Share This Post 🔥

1962లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు శంకుస్థాపన

1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రిక ప్రారంభం

చెరుకూరి రామోజీరావు ప్రస్థానం అనితరసాధ్యం.

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం.

కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి వెంకటసుబ్బారావు, వెంకట సుబ్మమ్మ దంపతుల కుమారుడైన రామోజీరావు.. 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలోని మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో 1947లో 8వ తరగతిలో చేరి, సిక్స్త్‌ ఫాం వరకు అక్కడే చదివారు. గుడివాడ కళశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు.

ఢిల్లీలోని ఓ యాడ్‌ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా తొలి ఉద్యోగం చేశారు. 1961ఆగస్టు 19న రమాదేవిని వివాహం చేసుకున్నారు. 1962లో హైదరాబాద్‌ వచ్చిన రామోజీరావు.. అదే ఏడాది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు శంకుస్థాపన చేశారు.

1965లో కిరణ్‌ యాడ్స్‌ పేరిట మరో సంస్థను ప్రారంభించారు. 1969లో రైతుల కోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజెస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీకి శ్రీకారం చుట్టారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్‌ హోటల్‌ను నిర్మించి, ప్రారంభించారు.

1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ వేదికగా ఈనాడు దినపత్రికకు శ్రీకారం చుట్టారు. 1975 డిసెంబరులో ‘ఈనాడు’ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 1976లో సినీ ప్రేమికుల కోసం సితార, 1978లో విపుల, చతుర మాసపత్రికలను ప్రారంభించారు. 1980లో ప్రియా ఫుడ్స్‌ పేరిట నోరూరించే పచ్చళ్లను తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు.

1983లో ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థను ప్రారంభించారు. 1992-93 మధ్య ఈనాడు ద్వారా సారాపై సమరం ప్రకటించిన రామోజీ రావు.. మద్య నిషేధంపై ఉత్తర్వులు వచ్చే వరకూ పోరాడారు. ప్రపంచంలోనే అతి పెద సినీ స్టూడియోగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీని 1996లో స్థాపించారు. 2002లో ఈటీవీ ఆరు ప్రాంతీయ చానళ్లను ప్రారంభించి, టీవీ రంగంలో సరికొత్త మార్పునకు నాంది పలికిన రామోజీరావును బీడీ గోయెంకా అవార్డు, యుధ్‌వీర్‌ అవార్డు వరించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!