Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఏపీలో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు. గతంలో 79.84 శాతం పోలింగ్… మరి ఇప్పుడు ఎంతో…?

Share This Post 🔥

ఏపీలో ఎవరు గెలుస్తారు?మంగళగిరిలో లోకేశ్‌ మెజార్టీ ఎంత? పిఠాపురంలో పవన్‌ పరిస్థితి ఎలా ఉంది? ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే.

మరి కొన్ని గంటల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. దేశంలో ఎక్కడున్నా ఈ సారి సొంతూరుకు వెళ్లి ఓటేయాలని ఆంధ్రా ఓటర్లు డిసైడయ్యారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. గతంలో 79.84శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఓటర్లు కూడా భారీగా తరలివస్తుండటంతో 83 శాతం పోలింగ్‌ జరిగే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నిల పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్‌ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

పోలింగ్‌ విధుల్లో 5.26లక్షల మంది సిబ్బంది..

2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68,185 ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో 1.6లక్షల ఈవీఎంలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. 3.30 లక్షల మంది పోలింగ్‌ విధులు నిర్వహించనున్నారు. 1.14లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీరికి అదనంగా మరో 10వేల మంది సెక్టార్‌ అధికారులు పనిచేస్తారు. 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్‌వోలు విధుల్లో ఉంటారని ఈసీ తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12,459 సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్టు వెల్లడించింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించనున్నారు. అనంతపురం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వందశాతం వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్‌సభలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతి అసెంబ్లీకి 46 మంది, మంగళగిరిలో 40 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు. శాసనసభకు పోటీపడుతున్న వారిలో అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌ పులివెందుల నుంచి పోటీలో ఉన్నారు. అత్యంత ఆస్తులు కలిగిఉన్న అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభకు కూటమి తరఫున పెమ్మసాని చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!