Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు అంశంపై సీఈఓకు డీజీపీ నివేదిక.

Share This Post 🔥

అమరావతి : మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అంశంపై రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌ కుమార్‌మీనాకు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నివేదిక అందజేశారు.

రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మే 15న పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 20న ఆయనను మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసినట్లు వివరించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నివేదికలో వెల్లడించారు. ఈవీఎం ధ్వంసంపై సిట్‌ రిపోర్టును కూడా ఈ నివేదికకు జత చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!