ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళ

ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారం ఆ పై హత్య.. పెద్దపల్లి జిల్లాలో సంచలన ఘటన…

Share This Post 🔥

అభం..శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి పైశాచికంగా ఆత్యాచారం చేసి ఆపై హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాటన్ పల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బిహార్ ప్రాంతానికి చెందిన బలరాం కొన్నాళ్లుగా కాట్నపల్లిలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ పరిసరాల్లో అదే గ్రామానికి చెందిన దంపతులకు నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఓ ఆరేళ్ల పాప కూడా ఉంది. అయితే, బలరాం కళ్లు ఆ పాపపై పడ్డాయి. దీంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయమాటలు చెప్పి బలరాం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టలాడు. బాలిక బ్రతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించిన బలరాం స్పాట్‌లోనే గొంతు నులిమి దారణంగా హతమార్చాడు. మృతదేహాన్ని గమనించి స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందజేయగా వారు.. కన్న కూతురి మృతదేహంపై పడి బోరున విలపించారు. తమ కూతురిని హత్య చేసిన వాడిన ప్రాణాలతో వదలకూడదని, వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని బాలిక తల్లిందండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!