Uncategorizedఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఆ శిశువుకు భూదేవే అమ్మ అయింది… లారీ డ్రైవరే ఆపద్బాంధవుడయ్యాడు.

Share This Post 🔥

మట్టిలో శిశువు కదలికలు గమనించి కాపాడిన డ్రైవర్‌.


బతికుండగానే రోడ్డు పక్కన పాతేసిన వైనం..

ఎంజీఎంకు తరలింపు..


ఎవరు చేసిన పాపమో తెలియదు కానీ…
అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు ప్రాణాలతో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పాతేశారు . ఆ రహదారి విస్తరణ పనుల్లో ఉన్న ఓ లారీ డ్రైవర్‌ మట్టిలో కదలికలను గమనించి ఆ పసికందును బయటికి తీసి ప్రాణాలు నిలబెట్టి ఆపద్భాందవుడయ్యాడు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని పెద్ద చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌-భూపాలపట్నం జాతీయ రహదారి-163 నాలుగు లేన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పెద్ద చెరువు ఎదురుగా రోడ్డును చదును చేసేందుకు వాటర్‌ ట్యాంకర్‌ (లారీ)తో నీటిని చల్లుతున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన మట్టిలో కదలికలు గమనించిన ట్యాంకర్‌ డ్రైవర్‌ రామ్‌దినయ్‌ వాహనాన్ని ఆపి ఆ మట్టిని తవ్వాడు. మట్టి కింద కొన ఊపిరితో ఉన్న ఓ పసికందును చూసి నిర్ఘాంతపోయిన డ్రైవర్‌.. ఉపాధి కూలీలను పిలిచాడు. పోలీసులు ఆ పసికందును అపోలో రీచ్‌ ఎన్‌ఎ్‌సఆర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. పసికందు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!