Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

పులివర్తి నాని పై దాడి…  తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.

Share This Post 🔥

తిరుపతి :: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడి ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి సమాచారం తెలుసుకున్న తెదేపా శ్రేణులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు.

నానికి మద్దతుగా నిరసన తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జి చేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడి చేసిన నిందితులను వదిలేసి తమపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతి రణరంగంగా మారింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఝుళిపించడంతో వారు కూడా నిరసనకు దిగారు. సీఐ రామచంద్రారెడ్డి తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!