ఆంధ్రప్రదేశ్మహిళ

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల…

Share This Post 🔥

అమరావతి : ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు షెడ్యూల్‌ విడుదలైంది.

ఆగస్టు 5 నుంచి 20వ తేదీవరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

టెట్ షెడ్యూల్‌ ఇదే..

టెట్‌ నోటిఫికేషన్‌ : జులై 2న
ఫీజు చెల్లింపు :  జులై 3 నుంచి 16వరకు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు : జులై 4 నుంచి 17వరకు
జులై 16 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు అందుబాటులోకి…
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : జులై 25 నుంచి
పరీక్షలు : ఆగస్టు 5 నుంచి 20వరకు (రెండు సెషన్లలో)
ప్రొవిజినల్‌ కీ : ఆగస్టు 10
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 11 నుంచి 21వరకు
తుది కీ విడుదల : ఆగస్టు 25
ఫలితాలు విడుదల : ఆగస్టు 30

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!