Uncategorizedఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

కల్కిలో ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు హీరోలు : దర్శకులు నాగ్ అశ్విన్.

Share This Post 🔥

  ప్రభాస్ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’లో పలు అతిథి పాత్రలున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ, మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌  తదితరులు ఆయా క్యారెక్టర్లు ప్లే చేశారని ఇటీవల సినీ వర్గాల్లో ప్రచారం సాగింది.

ఈ ఇద్దరు హీరోలు ‘కల్కి’ లో నటించారని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  తాజాగా క్లారిటీ ఇచ్చారు. గురువారం సినిమా విడుదల కానున్న సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ఆ విషయాన్ని వెల్లడించారు. తమ చిత్రంలో భాగమైనందుకు వారిద్దరికీ ప్రభాస్‌  థ్యాంక్స్‌ చెప్పారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.


ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌,  దీపికా పదుకొణె,  దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన, మాళవిక నాయర్‌ కీలక పాత్రలు పోషించారు. అతిథి పాత్రల్లో నాని, మృణాల్‌ ఠాకూర్‌ కూడా నటించారనే టాక్‌ వినిపించింది. కానీ, దీనిపై స్పష్టత లేదు. మరి, వీళ్లు యాక్ట్‌ చేశారా, లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఏపీలో ఆరో షోకు గ్రీన్‌ సిగ్నల్‌..

సినిమా విడుదలైన రోజు (జూన్‌ 27) నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వెలుసుబాటు కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆరో షోకు (గురువారం మాత్రమే) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం సైతం.. గురువారం నుంచి ఎనిమిది రోజుల పాటు టికెట్‌ ధరల పెంపునకు, వారం పాటు ఐదు షోలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 5.30 గంటల షోకూ (గురువారం మాత్రమే) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!