ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

అసెంబ్లీలో పార్టీలకు కార్యాలయాలు కేటాయింపు…

Share This Post 🔥

అమరావతి : పలు పార్టీలకు శాసనసభ ప్రాంగణంలో కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి రామాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి వినియోగించుకుంటున్న ముఖ్యమంత్రి ఛాంబర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేటాయించారు. అలాగే వైసిపి శాసనసభాపక్ష కార్యాలయాన్ని టిడిపికి కేటాయించారు. అలాగే ప్రస్తుతం టిడిపి వినియోగించుకుంటున్న కార్యాలయాన్ని జనసేన పార్టీకి, ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు కేటాయించిన కార్యాలయాన్ని పవన్‌కల్యాణ్‌కు, గతంలో బిజెపికి కేటాయించిన కార్యాలయాన్ని వైసిపికి కేటాయించారు. ప్రభుత్వ విప్‌కు కేటాయించిన మెట్ల దగ్గర వున్న కార్యాలయాన్ని బిజెపికి కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!