Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

వైకాపా విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి : డిజిపిని కోరిన చంద్రబాబు.

Share This Post 🔥

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైకాపా వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ తర్వాత ప్రణాళికాబద్ధంగా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందలమంది ప్రైవేటు సైన్యంతో జరుపుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి, శాంతిభద్రతల పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తిరుపతి, కారంపూడిలో ఉద్రికత్త వాతావరణం

మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా.. నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు మరోసారి రెచ్చిపోయాయి. పోలింగ్‌ రోజు విధ్వంసం సృష్టించిన ఆ పార్టీ శ్రేణులు ఇవాళ కూడా దాడుల పరంపరను కొనసాగించాయి. మంగళవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు. ఈక్రమంలో ఒక్కసారిగా తెదేపా కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన తెదేపా నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టారు. దాడులను ఆపేందుకు యత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా దాడికి తెగబడ్డారు. పట్టణంలో తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!