ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

పశ్చిమబెంగాల్‌ లో ఘోర రైలు ప్రమాదం. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీ…

Share This Post 🔥

పశ్చిమబెంగాల్‌ లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం తో ఓ బోగీ గాల్లోకి లేచింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతా (Kolkata)లోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ (Kanchanjungha Express) మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎక్స్‌ప్రైస్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేవడం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై డార్జిలింగ్‌ అదనపు ఎస్పీ మాట్లాడారు. ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారని, మరో 20-25 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఘటనపై సీఎం, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి

ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఎస్సీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!