Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఆకాశంలో రాకాసి ఉల్క… రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు.

Share This Post 🔥

స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది.

ఒక్కసారిగా చోటు చేసుకొన్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్కా ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



2013లో కూడా రష్యాలోని చెల్యాబిన్స్క్‌ అనే ప్రాంతంలో ఇంతకంటే పెద్ద స్థాయి ఉల్కలు పడ్డాయి. అప్పట్లో ఆ ఉల్కలు భారీగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందుకే ఆ స్థాయిలో నిప్పులు వచ్చాయని పేర్కొన్నారు. అది 500 కిలో టన్నుల టీఎన్‌టీకి సమానమైన శక్తిని విడుదల చేసిందని అంచనావేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!