Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి :: ఇడి సోదాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.

Share This Post 🔥

విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివారని, అందుకే పాకిస్థాన్‌ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు.

ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఏడాదికో నేతకు పంచుతారని దుయ్యబట్టారు. బిహార్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హజీపుర్‌, ముజఫర్‌పుర్‌, సరణ్‌లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ దాడులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

”ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా వారు (విపక్ష నేతలు) ఎందుకు గొంతు చించుకుంటున్నారో నేను చెప్తాను. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం ఓ స్కూల్‌ బ్యాగులో దాచిన రూ.35లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. అదే మేం అధికారంలో వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును బట్టబయలు చేసింది. ఆ నోట్ల గుట్టలను తరలించాలంటే కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలి. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే” అని మోదీ వ్యాఖ్యానించారు.

భాజపాలో మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరు? అంటూ విపక్షాలు చేసిన విమర్శలపైనా ఆయన స్పందించారు. ”పార్టీలో నాకు వారసులు లేరని అంటున్నారు. సామాన్య ప్రజలే నా వారసులు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌, ఆర్జేడీ వంటి పార్టీలు చెబుతున్నాయి. వారసత్వ పన్ను తీసుకురావాలని అంటున్నాయి. నేను బతికున్నంత వరకు అలా జరగనివ్వను. ప్రజల సొమ్మును దోచుకోవాలనుకునే వారి ప్రయత్నాలకు నేను అడ్డుగోడలా నిలబడతా” అని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రధాని తిప్పికొట్టారు. ”పిరికివాళ్లతో నిండిన విపక్షం పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తున్న ఆ నేతలు.. మన ఆయుధ సంపత్తిని కూల్చివేయాలనుకుంటున్నారు. ఇండియా కూటమి ఓ ఫార్ములాపై పనిచేస్తోంది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఏడాదికో నేత ప్రధానిగా ఉంటారు. అప్పుడు దేశం ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్తుందో ఊహించండి. వారిదో విఫల కూటమి” అని ధ్వజమెత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!