ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుచిన్నారిజాతీయంతెలంగాణసినిమా

ఒకే ఓవర్ లో 43 పరుగులు.. ప్రపంచ రికార్డ్…

Share This Post 🔥

43 రన్స్‌.. ఒక ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌ చేసిన స్కోరు కాదు ఇది. కేవలం ఒకే ఓవర్‌లో సాధించిన పరుగులు. ఇది ప్రపంచ రికార్డు కూడా…

లీసెస్టర్‌షైర్‌, సస్సెక్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇలా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లీసెస్టర్‌షైర్‌ తరఫున నంబర్‌ 8 స్థానంలో లూయిస్‌ కింబర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 59వ ఓవర్‌ వేసేందుకు సస్సెక్స్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ బంతినందుకున్నాడు.

అతడి బౌలింగ్‌లో కింబర్‌ సిక్స్‌లతో చెలరేగాడు. దీంతో బౌలర్‌ బంతిపై నియంత్రణ కోల్పోయాడు. మూడు నోబాల్స్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో బ్యాటర్‌ మొత్తం రెండు సిక్స్‌లు, 6 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈసీబీ డొమెస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌లో నోబాల్‌కు రెండు పరుగులు అదనంగా ఇస్తారు. ఇలా మొత్తం 43 పరుగులు ఒకే ఓవర్‌లో వచ్చాయి. ఆ ఓవర్‌లో వచ్చిన పరుగులు ఇలా ఉన్నాయి.. 6,6nb,4,6,4,6nb,4,6nb,1. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 134 ఏళ్ల చరిత్రలో ఒకే ఓవర్‌లో ఇన్ని పరుగులు కొట్టడం ఇదే రికార్డు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!