ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

24 నుండి కేసీఆర్ బస్సు యాత్ర..

Share This Post 🔥

మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు నిర్వహణ.

ప్రతిరోజూ ఉదయం రైతుల పొలాలు, కొనుగోలు కేంద్రాల సందర్శన

రైతులు, మహిళలు, ఇతర వర్గాలతో భేటీలు.

సాయంత్రం పూట ప్రధాన పట్టణాల్లో రోడ్‌ షోలు నిర్వహించేలా షెడ్యూల్‌

చివరిగా వచ్చే నెల 10న సిద్దిపేటలో బహిరంగ సభ

మధ్యలో కొన్ని చోట్ల సభలు నిర్వహించాలనే యోచన

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మే 10వ తేదీ వరకు కొనసాగే ఈ బస్సుయాత్రలో రోజూ సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

మొత్తంగా 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్‌ షోలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌ షోతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభమై.. సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో.. సాయంత్రం 5.30 గంటల తర్వాత ఈ రోడ్‌ షోలను ప్రారంభిస్తారు. రోడ్‌ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు.

బస్సుయాత్ర సాగే రూట్లలో ఉదయం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్‌ సందర్శించనున్నట్టు బీఆర్‌ఎస్‌ తెలిపింది. ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు.

ఆ ఐదు స్థానాల్లో రోడ్‌ షోలు లేనట్టే..:

కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌లో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్‌ రోడ్‌ షోలు లేవు. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్‌ పరిసర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల రోడ్‌ షోలు ఉంటాయని పేర్కొంటున్నాయి.

కేసీఆర్‌ రోడ్‌ షోల షెడ్యూల్‌ ఇదీ..:

ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర చేయనున్నారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటల మధ్య రోడ్‌ షోలు.. మిగతా సమయాల్లో రైతులను, వివిధ వర్గాల వారిని కలిసేలా షెడ్యూ ల్‌ ఖరారు చేశారు.

రోడ్‌ షోల షెడ్యూల్‌ను చూస్తే..
ఏప్రిల్‌ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలలో.. 25న భువనగిరిలో, 26న మహబూబ్‌నగర్‌లో, 27న నాగర్‌కర్నూల్‌లో, 28న వరంగల్‌లో, 29న ఖమ్మంలో, 30న తల్లాడ, కొత్తగూడెంలలో, మే 1న మహబూబాబాద్‌లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలో, 6న నిజామాబాద్‌లో, 7న కామారెడ్డి, మెదక్‌లలో, 8న నర్సాపూర్, పటాన్‌చెరులలో, 9న కరీంనగర్‌లో, 10న సిరిసిల్లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. చివరిగా 10వ తేదీనే సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!