జాతీయంతెలంగాణ

హోలీ వేడుకల్లో అపశ్రుతి…
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అగ్ని ప్రమాదం.

Share This Post 🔥



మధ్య ప్రదేశ్‌లో హోలీ వేడుకల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పండగ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి  ఆలయంలో హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అర్చకులతో సహా 13 మంది గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్య ప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాలి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో అర్చకులు ‘భస్మ హారతి’ ఇచ్చారు .

ఈ క్రమంలోనే హారతి మంటలు పెరిగి గర్భగుడి మొత్తం వ్యాపించాయి. ఆలయంలోని అర్చకులతో సహా 13 మంది గాయపడ్డారు. స్థానికులు ఆలయంలో నుంచి పొగలు రావడం గమనించి పొలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు మాట్లాడుతూ పూజారి ఆశిష్ శర్మ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల్లో భాగంగా హారతి ఇచ్చే క్రమంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!