Uncategorizedఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు.

Share This Post 🔥

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్

ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ నడుమ ఇండస్ట్రియల్, ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్మ్యాప్

మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ ప్రక్షాళన పనులతో పాజిటివ్ వేవ్స్

డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్

ఫిబ్రవరిలో రూ.920 కోట్ల రికార్డు ఆదాయం

ఆనరాక్, నైట్ ఫ్రాంక్ రిపోర్టుల్లోనూ సిటీనే టాప్

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో నగరానికి నాలుగో స్థానం


గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్ఎస్టేట్ జోరందుకున్నది. గడిచిన నాలుగు నెలలుగా ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆ ఏడాదిలోనే అత్యధికంగా రూ.918 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరిలో కాస్త జోరు తగ్గినట్టు కనిపించినా, ఫిబ్రవరిలో మరింత స్పీడ్ అందుకుంది. దీంతో రెవెన్యూ శాఖకు రూ.920 కోట్ల రికార్డు ఆదాయం వచ్చింది.

అటు ఇండ్ల అమ్మకాల్లోనూ గ్రేటర్ హైదరాబాద్దేశంలోని 7 ప్రధాన నగరాల్లో టాప్లో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి -మార్చి వరకు 38 శాతం వృద్ధి నమోదు చేసినట్లు మార్చి నెలాఖరులో అనరాక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటుందని ఇటీవల నైట్ ఫ్రాంక్ సంస్థ కూడా ఒక నివేదికను ప్రకటించింది.

కొత్త సర్కారు స్పెషల్ ఫోకస్

డిసెంబర్7న రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే తమ ప్రథమ లక్ష్యమని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి, డిసెంబర్18న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులతో కలిసి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. రీజినల్రింగ్ రోడ్డును ఫస్ట్ ప్రయారిటీ కింద పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించిన ఆయన, ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్నడుమ ఇండస్ట్రియల్, ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధికి రోడ్మ్యాప్ఆవిష్కరించారు. రీజినల్ రింగ్ రోడ్ లోపల 500 నుంచి వెయ్యి ఎకరాల భూములు గుర్తించి, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడలను తరలించే ప్లాన్పై చర్చించారు.

కొత్త మాస్టర్‌ ప్లాన్లు తెస్తామని, భవన నిర్మాణ అనుమతులను మరింత ఈజీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఎలివేటెడ్కారిడార్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు సర్కారు ఆదేశాల మేరకు ప్రస్తుతం 7,350 చదరపు కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరో 100 చదరపు కిలోమీటర్లు పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఓఆర్ఆర్ అవతల పీపీపీ విధానంలో శాటిలైన్ టౌన్షిప్ల నిర్మాణానికి రెడీ అవుతోంది. తక్కువలో తక్కువ 100 ఎకరాలు ఉండే టౌన్ షిప్ లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించి, విధివిధానాలు రూపొందిస్తోంది. ఇలాంటి సానుకూల పరిణామాల వల్లే హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో రియల్ఎస్టేట్ పుంజుకున్నట్టు రియల్ నిపుణులు చెప్తున్నారు.

జెట్ స్పీడ్తో అనుమతులు

మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులను స్పీడప్ చేయడం కూడా రియల్ జోరుకు మరో కారణంగా కనిపిస్తోంది. గడిచిన ఐదు నెలల్లో ఏకంగా 827 భవన నిర్మా ణాలకు ఆఫీసర్లు అనుమతులిచ్చారు. అదే సమయంలో హైరైజ్బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం కూడా ఊపందుకున్నది. గడిచిన మూడు నెలల్లో అనుమతుల కోసం హెచ్ఎండీఏకు వస్తున్న అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిరుడు డిసెంబరు వరకు హైరైజ్ భవనాల నిర్మాణం, లే అవుట్లు, వెంచర్లకు సంబంధించి నెలకు 10లోపే దరఖాస్తులు వచ్చేవి. కానీ జనవరి నుంచి ప్రతి నెలా15 నుంచి 20 వరకు అప్లికేషన్లు వస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో గతంలో రెండు నెలలకోసారి జరిగే మల్టీస్టోర్డ్బిల్డింగ్(ఎంఎస్బీ) కమిటీ సమావేశాలను ప్రస్తుతం వారానికోసారి నిర్వహిస్తున్నారు.

దేశంలోనే హైదరాబాద్ టాప్

ఈ ఏడాది జనవరి నుంచి భూముల అమ్మకాలు, ఇండ్ల విక్రయాల్లో గ్రేటర్హైదరాబాద్దూసుకెళ్తోందని ‘ఆనరాక్’ సంస్థ వెల్లడించింది. ఇళ్ల విక్రయాల్లో 38 శాతం వృద్ధితో హైదరాబాద్ దేశంలో టాప్‌లో నిలిచినట్టు తన మార్చి నివేదికలో వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి -మార్చి వరకు ఇళ్ల విక్రయాలు సగటున14 శాతం వృద్ధి నమోదు చేయగా, హైదరాబాద్తర్వాతి స్థానంలో ముంబై (24%), పుణె (15%), బెంగళూరు (14%) నిలిచాయని పేర్కొంది. ఢిల్లీలో 9 శాతం, చెన్నైలో 6 శాతం తగ్గుదల నమోదైనట్టు స్పష్టం చేసింది.

రాబోయే రోజుల్లోనూ దేశంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్మరింత పెరుగుతుందని ఇటీవల ‘నైట్ ఫ్రాంక్’ సంస్థ కూడా ఒక నివేదికను ప్రకటించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్-10 నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉన్నట్టు స్పష్టంచేసింది. సర్కారు నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉండటంతో రాష్ట్రంలో రియల్ఎస్టేట్ ఊపు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!