ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

హైదరాబాదులో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.

Share This Post 🔥

హైదరాబాద్‌::   ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలోని పలుకోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం  కురుస్తున్నది.

రాజేంద్రనగర్‌, తుర్కయంజాల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, కాచిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, బాగ్ లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్టీకపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, జల్‌పల్లిలో వర్షం కురుస్తున్నది. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉన్నది. శనివారం ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.కాగా, భానుడి భగభగలతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అకడకడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. తప్పక వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!