ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణ స్వీకారం.

Share This Post 🔥


తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు.
అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను, ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యతలను ప్రధాన న్యాయమూర్తికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ చదివి వినిపించారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి బదిలీపై వచ్చిన విషయం విదితమే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!