తెలంగాణమహిళసినిమా

హనుమాన్‌ జయంతి.. నేడు వీర హనుమాన్‌ విజయ యాత్ర..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

Share This Post 🔥

హనుమాన్‌ జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ తలపెట్టిన వీర హనుమాన్‌ విజయ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామ మందిర్‌లో యజ్ఞంతో హనుమాన్‌ పూజలు ప్రారంభమవుతాయి.

11.30 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా వద్ద సామూహిక హనుమాన్‌ చాలీసా పఠనం, ముఖ్య అతిథులతో బహిరంగ సభ నిర్వహిస్తారు. కర్మన్‌ఘాట్, సైదాబాద్, మలక్‌పేట్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర ర్యాలీలు కోఠిలో ప్రధాన యాత్రతో కలిసి తాడ్‌బన్‌ హనుమాన్‌ దేవాలయం వరకు కొనసాగుతుంది.

హనుమాన్‌ శోభా యాత్రకు భారీ పోలీస్‌ బలగాలను మోహరిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. భారీ భద్రత, సీసీ కెమెరాల నిఘా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ మధ్య యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

గౌలిగూడ రామ మందిరం నుండి పుత్లీబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, డీఎంహెచ్‌ఎస్‌ సుల్తాన్‌బజార్‌ క్రాస్‌రోడ్స్, రామ్‌కోఠి క్రాస్‌రోడ్, కాచిగూడ క్రాస్‌రోడ్, నారాయణగూడ వైఎంసీఏ మీదుగా చిక్కడపల్లి క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, గాందీనగర్‌ బ్యాక్‌ సైడ్‌ వైస్రాయ్‌ హోటల్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, బైబిల్‌ హౌస్, రామ్‌గోపాల్‌పేట్, ప్యారడైజ్‌ క్రాస్‌రోడ్‌ నుంచి తాడ్‌బన్‌ హనుమాన్‌ దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అక్కడ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనున్నది. యాత్ర కొనసాగే ఈ రూట్లలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మరో ఊరేగింపు కర్మన్‌ఘాల్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై చంపాపేట్ వద్ద హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించనుంది. మూసారం బాగ్ జంక్షన్ – మలక్ పేట – నల్గొండ ఎక్స్ రోడ్ – అజంపురా రోటరీ – చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్ మీదుగా డీఎంఅండ్‌హెచ్ఎస్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఇక ఈ యాత్ర జరగనున్న ప్రదేశాలన్నింటిలోనూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!