ఆంధ్రప్రదేశ్చిన్నారిజాతీయంతెలంగాణరాజకీయంసినిమా

సోషల్ మీడియాలో వచ్చే గాసిప్‌లను నమ్మకండి… మహేష్ – రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్.

Share This Post 🔥

రాజమౌళి దర్శకత్వంలో స్టార్‌ హీరో మహేశ్‌ బాబు ఓ సినిమాలో (SSMB29) నటించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి. తాజాగా వాటిపై నిర్మాత గోపాల్‌రెడ్డి స్పందించారు.

‘ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి రాజమౌళికి (SS Rajamouli) తప్ప మరెవరికీ ఏ అప్‌డేట్‌ తెలియదు. ఆయన చాలా అంకితభావం కలిగిన వ్యక్తి. నిరంతరం సినిమా కోసమే పని చేస్తారు. నేను విజయేంద్రప్రసాద్‌తో పలుమార్లు చర్చించాను. ఈ కథ మొత్తం విన్నా. అద్భుతంగా ఉంది. దీని షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అనే అప్‌డేట్స్‌ అన్నీ రాజమౌళికే తెలుసు. దీని గురించి సోషల్ మీడియాలో వచ్చే గాసిప్‌లను నమ్మకండి’ అని చెప్పారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న నటుడని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని ఆయన గతంలో చెప్పారు. ఇందులో హాలీవుడ్‌ నటీనటులను తీసుకొనే అవకాశం కూడా ఉందన్నారు.

ఇటీవల మహేశ్-రాజమౌళి ఇద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. అందులో మహేశ్‌బాబు లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే వీళ్లిద్దరూ దుబాయ్‌ వెళ్లారని రకరకాల వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!