ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయం

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన.

Share This Post 🔥

విజయవాడ:   సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబా కొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు.

రూ.200 ఇస్తామని చెప్పి జగన్‌ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా ఐదుగురు పిల్లలను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!