ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీ అయింది. నాలుగో విడత పోలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కేటాయించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది.