జాతీయంతెలంగాణరాజకీయం

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో కెసిఆర్ అన్న కుమారుడు కన్నారావుపై కేసు నమోదు…

Share This Post 🔥

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు.

ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంత మందితో కలిసి ఆయన విజయవర్ధన్‌ రావును గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించాడు. అతడిని బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కన్నారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!