ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంతెలంగాణమహిళ

సంపూర్ణ సూర్యగ్రహణం.
54 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం… ఆకాశంలో అద్భుతం …ఎప్పుడంటే……

Share This Post 🔥



2024లో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి. 1970 లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏప్రిల్ 8న ఖగోళంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనే ఒక అరుదైన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కానుంది. ఈ రకమైన సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు ఆకాశం కొంత సమయం పాటు చీకటిగా మారుతుంది. సూర్యగ్రహణం భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం.. భూమి.. సూర్యుని మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీని కారణంగా సూర్యుని కిరణాలు భూమిని చేరుకోలేవు.



భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9.12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ సమయంలో సుమారు 7:30 నిమిషాల పాటు సూర్యుడు కనిపించడు. అంటే ఈ గ్రహణం మొత్తం సమయం 4 గంటల 39 నిమిషాల పాటు ఉండనుంది. ఈ గ్రహణం చాలా అరుదుగా ఉంటుంది.అయితే ఇది భారత్‌లో కనిపించబోదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.


కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, నైరుతి యూరప్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి ముందు రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. కనుక ఆ రోజున ఆకాశంలో చంద్రుడు కొంచెం పెద్దదిగా కనిపిస్తాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!