ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమహిళరాజకీయం

షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం … మంటల్లో చిక్కుకున్న సిబ్బంది.

Share This Post 🔥

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో చాలామంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు.

తమను కాపాడాలంటూ లోపలి నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్నవాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిచ్చెనల సాయంతో వీలైనంత వేగంగా బాధితులను బయటకు తీసుకువస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత ఆస్తినష్టం వివరాలు తెలిసే అవకాశముంది.
…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!