ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుచిన్నారితెలంగాణమహిళ

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే…!!

Share This Post 🔥

వేసవిలో ప్రతి మనిషికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడం ఎంతో అవసరం. వేసవిలో ద్రవ పదార్థాలను, శరీరానికి శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీన పెరిగి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. వేసవిలో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల చర్మంపై అలర్జీలు, దగ్గు, ఫ్లూ లాంటివి వస్తుంటాయి. అందుకే సమ్మర్‌లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం వైద్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు, సూచనలు మీకోసం…

వేసవిలో ఆరోగ్యం ఉండాలంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి లాంటి సిట్రస్‌ ఫుడ్‌ను సలాడ్స్‌, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో ఉండే సీ-విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.



వేసవిలో క్యారెట్‌, గుమ్మడికాయ, బీట్‌రూట్‌లు తినడం ద్వారా విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం లభిస్తుంది. వీటిని తినడం ద్వారా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.

ఇమ్యూనిటీ పెరగాలంటే ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే వేసవిలో పప్పులు, గుడ్లు, చేపలు, నట్స్ లాంటివి కూడా ఆహారంలో తీసుకోవాలి.



అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగడాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం అవసరం. అందకే వేసవిలో దాహం వేయకపోయినా నీళ్లు, జ్యూస్‌లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి.


బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, జింక్‌, సెలేనియమ్‌ వంటి న్యూట్రియెంట్లు వేసవిలో ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతాయి. వేసవిలో పిల్లలు, గర్భిణులకు నట్స్ చాలా మంచివి.



వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్భూజా లాంటి సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మాంగనీస్, విటమిన్‌ ఏ, పొటాషియం లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.

ఇకపోతే సమ్మర్‌లో మసాలాలు, కారం, వేపుళ్లు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతినే అవకాశముంది. వాటితోపాటు సమ్మర్‌లో ఫ్రైడ్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!