ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

లోక్ సభ ఎన్నికల వేళ… చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.

Share This Post 🔥

రాయ్‌పుర్:      మరో 10 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌ లోని కాంకేర్‌జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

ఛోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం.

బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఛోటేబేథియా పీఎస్‌ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!