సినిమా

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుండి అనౌన్స్ మెంట్.

Share This Post 🔥


రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా పాట విడుదల.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘జరగండి జరగండి’ పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పాటను విడుదల చేస్తున్నారు. పాటకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!