తెలంగాణ

మాంసం ప్రియులకు షాక్… హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్…

Share This Post 🔥

ఆదివారం అనగానే ఫుడ్ విషయంలో అందరికీ గుర్తుకొచ్చేది చికెన్, మటన్ షాపులు.. కిరాణా షాపులకు కంటే సండే రద్దీగా ఉండేది ఇవే.. కాకపోతే వచ్చే ఆదివారం..

అంటే 2024, ఏప్రిల్ 21వ తేదీ మాత్రం హైదరాబాద్ లో మటన్ షాపులు బంద్ చేస్తున్నట్లు తెలుస్తోంది  ఎందుకంటే…

ఏప్రిల్‌ 21న మహావీర్‌ జయంతి సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు రిటైల్‌ మాంసం, గొడ్డు మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఉత్తర్వుల జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తమ పరిధిలో అమలు చేయాలని అధికారులను రోనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు.

మహావీర్ జయంతి జైన మతంలో అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగలలో ఒకటి.  మహావీరుని జన్మదినాన్ని పురస్కరించుకొని, పండుగ దృష్ట్యా, హైదరాబాద్‌లోని పశువుల కబేళాలతో పాటు అన్ని మాంసం మరియు గొడ్డు మాంసం దుకాణాలను ఆదివారం మూసి వేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!